Listen to this article

ప్రత్యేక పూజలు చేసిన నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్

జనం న్యూస్ – సెప్టెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ బస్టాండ్ వెనుకన ఉన్న బంజారా కాలనీలో బంజారా గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ గణనాధునికి ప్రత్యేక పూజలు చేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా బంజారా గణేష్ యూత్ సభ్యులు శీను నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బంజారా గణేష్ సభ్యులు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.