

బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మంగలి గల్లీలో శ్రీ చత్రపతి శివాజీ గణేష్ మండలి ఏర్పాటుచేసిన శ్రీ విగ్నేశ్వర(శ్రీ గణపతి దేవుని) చేతిలో ఉన్న లడ్డును తొమ్మిది రోజులు వివిధ రూపాలలో పూజలందుకున్న లడ్డును గురువారం నిర్వహించిన లక్కీ డ్రా లో కొడిచెర గ్రామానికి చెందిన శంకర్ శ్రీదేవి దంపతులకు లడ్డు వరించిందని గణేష్ మండలి నిర్వాహకులు తెలిపారు. అలాగే రమేష్ దంపతులకు, గడ్డం రాజు దంపతులకు లడ్డు, డబ్బుల హారము వరించిందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.

