

జనం న్యూస్- సెప్టెంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్వానీస్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఒక గొప్ప ఉపాధ్యాయుడు తత్వవేత్త భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిన మేధావి అని అన్నారు, కరస్పాండెంట్ హృదయరాజ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని, ఉపాధ్యాయులు సైతం సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా తీసుకొని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. సాంస్కృతిక క్రీడా పోటీలలో గెలుపొందిన ఉపాధ్యాయులను సన్మానించి బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ జ్వానీస్, కరస్పాండెంట్ హృదయరాజ్, హేమలత, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.