Listen to this article

సెప్టెంబర్06 (జనంన్యూస్):

పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో వరసిద్ధి వినాయక యూత్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన 19 అడుగుల భారీ వినాయకుని నిమర్జనము శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇంత పెద్ద వినాయకుని విగ్రహం పాపన్నపేట మండలంలోని ప్రప్రథమంగా నిలిచింది. యువజన సంఘం యువకులు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి 200 కిలోమీటర్ల కోరుట్ల నుండి నాలుగు రోజులు శ్రమించి కొత్తపల్లికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా వారిని గ్రామ పెద్దలందరూ అభినందించారు. భారీ వినాయకుని చూడటానికి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.అందరి సహాయ సహాకారణాలతో నెలకొల్పిన వినాయకుని ఏర్పాటు పట్ల ప్రజల్లో ఉన్న హిందూత్వాన్ని చాటి చెప్పారు.యువతలో మంచి హైందవ సమాజం నిర్మాణంలో భాగంగానే భారీ వినాయకుని నెలకొల్పటం విశేషంగా చెప్పవచ్చు.దీనితో రాబోయే రోజుల్లో మరింతగా హిందూ ధర్మం పరిఢవిల్లాలని కోరుకుందామని యువజన సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఈనిమజ్జనం కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు డప్పు చెప్పులు,బ్యాండ్ మేళాలతో,భక్తి పాటలతో,ఆట పాటలతో హుషారుగా పాల్గొన్నారు.