

నెమ్మాది వెంకటేశ్వర్లు CITU జిల్లా కార్యదర్శి
జనం న్యూస్ సెప్టెంబర్ 6 నడిగూడెం
ఇటివల విద్యుత్ షాక్ తో మరణించిన మండల పరిధిలోని రత్నవరం గ్రామానికి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ మొలుగురి నరసింహ రావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనీ సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం రత్నవరం గ్రామం లో నర్సింహరావు దశ దిన కార్యక్రమం లో బాగంగా ఆయన చిత్ర పటానికి శ్రద్దాంజలి ఘటించారు.ఈ సందర్భంగా నెమ్మాది మాట్లాడుతూ దళిత పేద కుటుంబానికి చెందిన నరసింహరావు చిన్న వయస్సులో విద్యుత్ షాక్ తో మరణించటం వల్ల చంటి పిల్లల తో కుటుంబం వీధిన పడిందని ఆయన అన్నారు… మరణించిన నరసింహరావు కుటుంబానికి 10 లక్షల రూపాయలు, భార్య కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం రాంబాబు, జిల్లా సహాయ కార్యదర్శి సోమయ్య గౌడ్, సోమపంగి రాధాక్రిష్ణ, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అద్యక్షుడు షేక్ శుభాని , చిమట నాగరాజు, విజయ్ కుమార్, వెంకన్న బాలాజీ నాయక్, ఉపేందర్, కమలాకర్ వెంకటరాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.