

జనం న్యూస్ సెప్టెంబర్ 06: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండల కేంద్రంలోబద్దం వారి శ్రీ శివ పంచాయత హనుమాన్ మందిరంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల మొదటి శనివారం అన్నదానం నిర్వహించడం ఆలయ పరంపరగా కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో బద్దం వారి సంఘాల సభ్యులు, హనుమాన్ భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొని సేవలో భాగమయ్యారు. అన్నదాన దాతలుగా ముందుకు రావాలనుకునే వారు తమ వివరాలను ఆలయ కమిటీకి తెలియజేయవలసిందిగా నిర్వాహకులు సూచించారు.
