Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినo పురస్కరించుకొని నిన్న మిలాన్ డే నవీన్ సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో ఈరోజు విద్యార్థుల విద్యార్థులు పాఠశాలలో గురుపూజ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధానోపాధ్యాయులు జె హైమావతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ అత్యంత పేద కుటుంబంలో జన్మించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశం లో అత్యున్నత పదవి దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారని ఒక ఉపాధ్యాయుడు స్థానం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందున వారి జన్మదినo ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటున్నామని విద్యార్థులు విద్యార్థులు ఇటువంటి మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని జీవించాలని అన్నారు. విద్యార్థులు మంచి విలువలు కలిగిన జీవితాన్ని అవలంబించాలని, క్రమశిక్షణఉత్తమ విలువలు కలిగి ఉండాలని మంచి నడవడికతో ఉన్నత స్థానాలు అధిరోహించాలని తెలిపారు,ఉపాధ్యాయులుగా మేము మీ శ్రేయస్సుని కోరుకుంటామని తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె హైమావతి ని శాలువా,దండ మెమొంటోలతో ఘనంగా సత్కరించారు పాఠశాల ఉపాధ్యాయులు పి శైలజ,పోటు శ్రీనివాసరావు, జి.ఆదిలక్ష్మి,కె అరుణ,సిహెచ్ నవ్య తదితరులు పాల్గొన్నారు