

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 06 :
గురుపూజోత్సవం సందర్భంగా ఐటీడీఏ భద్రాచలం గిరిజన భవన్ లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఏన్కూరు మండలం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల పోచారం పాఠశాలలలో తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్న డిఎస్. నాగేశ్వరరావు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును బి.రాహుల్ ఐఏఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ భద్రాచలం, డిప్యూటీ డైరెక్టర్ మణేమ్మ వారి చేతులు మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు, ఫిబ్రవరి 1994 నా గిరిజన సంక్షేమ శాఖలో మొదటి నియామకం పొంది ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ఇర్సులాపురం, రేలకాయలపల్లి,మూల పోచారం పాఠశాలల్లో పనిచేస్తూ 31 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నానని, గిరిజన మన్య ప్రాంతంలో గిరిజన విద్యార్థుల కోసం అహర్నిశలు శ్రమిస్తూ నూరు శాతం ఫలితాలు సాధించడంలో కృషి చేస్తూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం నాకు కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.నేను బోధించే సబ్జెక్టులలో నూరు శాతం ఫలితాలు సాధిస్తూ గిరిజన సంక్షేమ శాఖ ప్రాజెక్టు ఆఫీసర్ లచే, డిప్యూటీ డైరెక్టర్ భద్రాచలం, ఖమ్మం వారిచే సన్మానాలు ప్రశంసలు పొందడం వలన నాపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావటం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, నాలుగో తరగతి ఉద్యోగస్తులు, శ్రేయోభిలాషులు విద్యార్థిని, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.