

జనం న్యూస్ సెప్టెంబర్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తెలుగుదేశం పార్టీలో మహిళా విభాగంలోనే కాకుండా వార్డు ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ కమిటీ, బూత్ కమిటీ, ఎన్నికల సమయంలో తనే అభ్యర్థి అనే విధంగా గృహిణిగా ఉంటూ నిత్యం పార్టీ కోసం పనిచేస్తున్న వేదల సూర్యప్రభకు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా నియమించినందుకు ఆమెకు హృదయపూర్వకంగా అభినందనలు హర్షం వ్యక్తపరుస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల వెంకటరావు అన్నారు. సూర్యప్రభ గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం అంకితభావంతో, నిబద్ధతతో పనిచేస్తూ, పార్టీలో చిన్న నాయకుడు నుండి పెద్దల వరకు ఆమె పట్ల గౌరవభావంతో ఉండేవారని, మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా ఓడిపోయినప్పటికీ, ఎక్కడ అసంతృప్తి పడకుండా, కర్తవ్యంతో ప్రజాసేవకు అంకితమై, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అర్హత ఉన్న ప్రతి పేదవారికి సేవలు అందించారని, ఏ కారణమైన రానివారికి, పార్టీ నాయకుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారమయ్యే వరకు విడిచి పెట్టే వారు కాదని వెంకటరావు అన్నారు. హర్షం ప్రకటించిన వారిలో కాండ్రేగుల సత్యనారాయణ, బోడి వెంకటరావు కుప్పిలి జగన్ మల్ల గణేష్, మల్లా శివన్నారాయణ, పోలిమేర నాయుడు విల్లూరి రమణబాబు కాండ్రేగుల రవీంద్ర దూలం ప్రసాద్ తదితరులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.