Listen to this article

జనం న్యూస్ 11 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద పరిగి నియోజకవర్గ ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణానికి 1 ఎకరా భూమి కేటాయించడం జరిగింది. బుధవారం రోజు నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు,ముదిరాజ్ సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి పరిగి శాసనసభ్యులు & డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సోదరులు ఎమ్మెల్యే TRR గారిని ఘనంగా సన్మానించి,కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ, ముదిరాజ్‌ సంఘ అభివృద్ధికి నిరంతరం తోడ్పాటును అందిస్తానని అన్నారు. అలాగే ముదిరాజ్ సోదరులను బిసి-డి నుండి బీసీ-ఏ లోకి చేర్చాలని 2014లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు.తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముదిరాజ్ సోదరులను బిసి-డి నుండి బీసీ-ఏ లోకి రావడానికి కృషి చేస్తానని తెలిపారు. అదే విధంగా ముదిరాజ్ సోదరులను రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో అవకాశం కల్పించామని భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని అన్నారు. BC లకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయుటకు కాంగ్రెస్ పార్టీ నిబద్ధతగా ఉందని రాబోయే రోజుల్లో కచ్చితంగా బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని తెలిపారు. సమాజంలో ముదిరాజులు అన్ని రంగాల్లో పనిచేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడుతున్నారని అభినందించారు. ముదిరాజ్ సమాజ అభ్యున్నతికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.