Listen to this article

జనం న్యూస్, సెప్టెంబర్ 11, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్, ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు గుడాల శేఖర్ గుప్త గురువారం హైదరాబాద్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావును,మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా గుడాల శేఖర్ గుప్త మాట్లాడుతూ హైదరాబాద్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు తో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావును మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది అని జర్నలిస్టులు ప్రజా సమస్యల మీద వార్త కథనాలు రాస్తూ ప్రజలకు అండగా ఉండాలని, నిష్పక్షపాత వార్తలు రాసిన సమాజ హితం కోసం పనిచేయాలని జర్నలిస్టుల సంక్షేమానికి బిజెపి కట్టుబడి ఉందని రామ చందర్ రావు తెలిపారని అన్నారు