Listen to this article

యాదగిరిఎమ్మెస్పి జిల్లా కోఇంచార్జీ

జనం న్యూస్, సెప్టెంబర్ 11, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ,ములుగు విజయ్ కుమార్

చేర్యాల మండల కేంద్రంలో( వి హెచ్ పి ఎస్) సుతారి రమేష్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లిగారి యాదగిరిఎమ్మెస్పి జిల్లా కోఇంచార్జీ హాజరై మాట్లాడుతూ
మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత, దివ్యాంగుల పెన్షన్ దారులకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ పెంచి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ నెల15న నిర్వహించే తలపెట్టిన ఎమ్మార్వో కార్యాలయం ముట్టడికి, చేర్యాల పరిసర గ్రామాల, వితంతువులు,ఒంటరి మహిళలకు, బీడీ, చేనేత, గీత పెన్షన్ దారులు అధిక సంఖ్యలో హాజరై ఎమ్మార్వో కార్యాలయ ముట్టడిని పెద్ద ఎత్తున విజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సనవాల ప్రసాద్, మాదాసు యాదగిరి మండల ఇంచార్జీ మరియు వికలాంగులు, వృద్ధులు వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులు పాల్గొన్నారు