Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా బీజేవైఎమ్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ గౌడ్ అధ్యక్షతన అమలాపురం పట్టణం ఎర్ర వంతెన నందు స్వామి వివేకానంద విగ్రహం వద్ద దిగ్విజయ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా జిల్లా కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి స్వామి వివేకానంద ప్రపంచ మహాసభలలో భారతదేశం ఔన్నత్యాన్ని హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప రోజుగా దిగ్విజయ దివాస్ జరుపుకుంటున్నామని, ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన యువత దేశానికి ఎంతో అవసరం అని మరొకసారి ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాశిన ఫణీంద్ర,భాజపా జిల్లా ఉపాధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి,మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు చిట్టురి రాజేశ్వరి, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు జగతా శాంతి, మహిళా మోర్చా నాయకురాలు దొంగ భవాని,అమలాపురం రూరల్ మండల అధ్యక్షుడు బొంతు శివాజీ, అల్లవరం మండల అధ్యక్షుడు కట్టా నారాయణ మూర్తి, భాజపా నాయకులు పెరబత్తుల సుబ్బారావు, యువ మోర్చా నాయకురాలు లోహిత తదితరులు పాల్గొన్నారు