

జనం న్యూస్ సెప్టెంబర్ 12 సంగారెడ్డి జిల్లా
పటాన్ చేరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆంధ్రా కాలనీ పట్టా పగలు విద్యుత్ దీపాలు వెలుగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు.విద్యుత్ ఆదా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎల్‌ఇడి బల్బులను తీసుకొచ్చింది. క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోక పోవడంతో ఇలా పగటిపూట వీధి దీపాలు వెలుగుతుండడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందే తప్ప, విద్యుత్ ఆదా కాదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు
