

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు..
జనం న్యూస్ జనవరి 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా జ్యోతి డైరీ ను ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ దేవిడ్ మాట్లాడుతూ ప్రభుత్వం-ప్రజలకు మధ్య వారధి పత్రికలని, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువేయడంలో వాటి పాత్ర కీలకమని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ శదేవిడ్ అన్నారు.
. నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని, వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేర్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమం ప్రజా జ్యోతి జిల్లా స్టాపర్ సతీష్ గౌడ్, దుర్గం భీం రావు, చంద్రగిరి తులసీదాస్, కత్తెరసాల శ్రీనివాస్, అదే లక్ష్మణ్, వంగాల ప్రవీణ్, జలీల్ షేక్ తిరుపతి, జాడి శ్రీనివాస్, సురేష్ జర్నలిస్టు పాల్గొన్నారు