Listen to this article

జనం న్యూస్,సెప్టెంబర్12, అచ్యుతాపురం:

సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధ పడుతున్న అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామానికి చెందిన సంతోషి అనే ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం స్నేహంజలీ పూర్ ఫర్ పీపుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రూ.10 వేలు ఆర్ధిక సాయంగా అందించారు.అనారోగ్యంతో బాధపడుతున్నట్టు రైల్వే టిటిఈ మలిజెడ్డి అప్పారావు సంస్థ వ్యవస్థాపకులు బోగేష్ కి తెలియజేయడం జరిగింది. బాధితులను విశాఖపట్నం కెజిహెచ్ లో పరామర్శించి సంస్థ ద్వారా వాళ్ల గ్రామానికి వెళ్ళి ఆర్ధిక సహాయం చేయడం జరిగిందని స్నేహంజలీ పూర్ ఫర్ పీపుల్ ఆర్గనైజేషన్ వారు తెలిపారు.ఈ సంస్థ చేస్తున్నా సహాయ కార్యక్రమాలను తెలుసుకొని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సంస్థ సభ్యులకు ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడమట సతీష్, వార్డ్ మెంబెర్ నాగేశ్వరావు, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు మలిజెడ్డి రమణారావు, పాల్గుణ, చంటి, సంధి శ్రీను, చిలుకు,అబద్దం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.