Listen to this article

శిబిరంలో సిపిఐ, ఏఐటీయూసీ సంఘీభావం

జనం న్యూస్ సెప్టెంబర్ 12 ( కొత్తగూడెం నియోజకవర్గం )

కొత్తగూడెం మండలం, కొత్తగూడెం నగరపాలక సంస్థ 2వ నెంబర్ బస్తీలో ఉన్న ఎస్టి పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ వర్కర్లు తొమ్మిది నెలలుగా వేతనాలు రాకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నారు.ఈ సమ్మె శిబిరాన్ని సిపిఐ, ఏఐటీయూసీ కొత్తగూడెం పట్టణ ప్రతినిధి బృందం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య మాట్లాడుతూ – “9 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వకపోగా, వర్కర్లతోనే వెట్టిచాకిరి చేయించడం దారుణం. కాంట్రాక్టు ఏజెన్సీని రద్దు చేసి, వర్కర్లను ప్రభుత్వమే నేరుగా నియమించి జీవ ప్రకారం వేతనాలు చెల్లించాలి” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సమ్మె చేస్తున్న వర్కర్లను కక్షసాధింపు చర్యలకు గురిచేయకుండా చూడాలని, వారి కుటుంబాలు పస్తులు ఉండటమే సమ్మెకు కారణమని జమలయ్య స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్, 1 టౌన్ కార్యదర్శి కొల్లాపూరి ధర్మరాజు, 3 టౌన్ కార్యదర్శి ఎం.డి. యూసుఫ్, సహాయ కార్యదర్శి బోయిన్ విజయ్ కుమార్, 10వ డివిజన్ కార్యదర్శి రాకేష్, సిపిఐ నాయకులు అజీజ్, మహిళా సమైక్య నాయకురాలు పుట్ట భాగ్యలక్ష్మి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కొక్కిలిగడ్డ రామకృష్ణ, ఆరు వార్డుల ఇంచార్జి కార్యదర్శి మండల రాజేశ్వరరావు, పోలోజు సత్యనారాయణ చారి, CPI నాయకులు తదితరులు పాల్గొన్నారు.