Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 12 నడిగూడెం

నేడు నిర్వహించబోయే లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎస్ఐ జి. అజయ్ కుమార్ కోరారు. శుక్రవారం నడిగూడెం పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీమార్గమే రాజమార్గమని, కక్షలు, కార్పాణ్యల తో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరు గెలిచినట్లేనని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల అంగీకారంతో సత్వర పరిష్కారం పొందవచ్చన్నారు. క్రిమినల్ కాంపౌండ్, బుల్ కేసులు, సివిల్ తగాదాల కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులలో కక్షిదారులు రాజీపడాలని సూచించారు. జ్యుడీషియల్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ కోరారు.