

జనం న్యూస్,కోహెడ మండలం,సెప్టెంబర్ 12,
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షలతో పొంగుతున్న వాగులు, వంకలు, అలుగు పారుతున్న చెరువులు. కోహెడ మండలం,చిగురుమా మిడి మండలం, ఇందుర్తి, ఓగులాపూర్, గ్రామాల మధ్య లో లెవల్ వంతెన పై ఉధృతంగా ప్రవహిస్తున్న ఎల్లమ్మ వాగు.గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు.కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగు, గ్రామానికి నిలిచిన రాకపోకలు ప్రజలు ఇంటి వదనే ఉండాలని బయటకు రావద్దని. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వంతెనపై రాకపోకలు నిలిపివేయడం జరిగింది.