

చిటికెన ముసలయ్య రాష్ట్ర బిసి నాయకులు
జనం న్యూస్ 17 సెప్టెంబర్ ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్)
సెప్టెంబర్ 17న విమోచన దినంగా ప్రభుత్వం నిర్వహించాలని కేంద్ర హోం శాఖ సర్కులర్ ను ఇటీవల కాలంలో విడుదల చేసింది. తెలంగాణలో జరిగిన ఎన్నికల సభలో మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి బహిరంగ ప్రకటన చేశారు. గతంలో కర్ణాటకలో జరిగిన ఎన్నికల క్యాంపియన్‌లో కూడా ఇదే నినాదాన్ని ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ముస్లిం నవాబు పాలనపై మత మార్పిడికి వ్యతిరేకంగా మెజారిటీగా ఉన్న హిందువులు పోరాడి విజయం సాధించారు , ఆనాడు హోం శాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాల పోలీసు వల్లనే హైదరాబాద్ విముక్తి. అఖండ భారత్ నిర్మాణం కు గుండెకాయ లాంటి హైదరాబాదును పాకిస్తాన్ లో నైజాం నవాబ్ కలిపేవాడనే వాదనలను BJP నాయకులు రజాకార్ సినిమా ద్వారా బలంగా ముందుకి తెచ్చారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆంధ్ర మహాసభ నాయకత్వం, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ విరోచిత పోరాట చరిత్రను నేటి తరానికి అర్థం కాకుండా వక్రీకరించే కుట్ర చేశారు
1942 – 1951 వరకు ఫ్యూడల్ భూస్వాములు, దేశ్ ముక్ లు, దేశ్ పాండేలు , జాగీర్లు , గ్రామ అధికారులు ఉన్న పటేల్ ,పట్వారి, మాలి పటేల్, రజాకార్ల నిర్బంధ పన్నుల వసూళ్ల దోపిడీ, రైతుల సాగు భూముల నుండి బేధాఖల్ చర్యలకు, తెలుగు, కన్నడ, మరాఠీ మాతకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు వీరోచిత పోరాటాలను కొనసాగించారు. ఈ పోరాటం ప్రజలు మాట్లాడే హక్కు, సభలు నిర్వహించుకునే హక్కు, కౌలు రైతుల హక్కులు ,ప్రాథమిక ప్రజాతంత్ర హక్కులు , పత్రిక స్వేచ్ఛ కావాలనే డిమాండ్లను సమాజం ముందుంచింది. దున్నేవానికి భూమి కావాలని నినదించింది.పసలేని పటేల్ సైన్యాలు వల్లనే తెలంగాణ విముక్తి వాదన:ఆపరేషన్ పోలో పేరుతో పటేల్ మిలటరీ పోలీసు సంస్థ చర్య వల్లనే ముస్లిం నైజాం నవాబ్ , రజాకార్ల హైదరాబాద్ నుండి విముక్తి చెందింది అనే బిజెపి నాయకుల వాదన వీర తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాట చరిత్రను వక్రీకరించడం తప్ప మరొకటి కాదు . గవర్నర్ జనరల్ జే ఎన్ చౌదరి నాయకత్వంలో కర్నూలు, విజయవాడ , సోలాపూర్ మూడు వైపుల నుండి కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించారు 24000 మంది భారత యూనియన్ సైన్యం హైదరాబాద్ సంస్థలోకి ప్రవేశించింది. వీరిలో శిక్షణ పొందిన సైన్యం ఆనాటి రికార్డుల ఆధారంగా కేవలం 6000 మంది మాత్రమే. 1948 సెప్టెంబర్ 13న పోలీస్ చర్య జరిగింది . దీనిని అవకాశంగా తీసుకున్న ఆంధ్ర మహాసభ నాయకత్వం, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు , ప్రజలు సాయుధ దళాలు ఐక్యంగా కదిలి అనేక ప్రభుత్వ పోలీస్ క్యాంపులపై దాడులు చేశారు. ఆయుధాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు . బాంచన్ దొర నీ కాళ్లు మొక్కుతా అన్న బక్కోనితో తుపాకిని పట్టించి తిరగ బడేటట్లు చేసింది. ప్రజాదళాలు సైనిక బలగాలకు మధ్య ఈ దశలో ఘర్షణ కూడా జరగలేదు. ప్రజా తిరుగుబాటును ఎదుర్కోలేని నైజాం సర్కార్ రాజా సైన్యాలు సరిహద్దు ప్రాంతాల గగనతలం నుండి విమానాల ద్వారా తుపాకుల మోత యూనియన్ సైన్యాలు మోగించగానే ఇదే అవకాశంగా భావించి నూతిలో తుపాకులు పడేసి పారిపోయి పోయాయి.1948 సెప్టెంబర్ 17న నైజాం నవాబు లొంగిపోతున్నట్లు ప్రకటన చేశారు. కేవలం ఐదు రోజులకే హైదరాబాద్ సంస్థను భారత యూనియన్ లో విలీనం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ యూనియన్ సైన్యాలు 1951 అక్టోబర్ 1 వరకు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నాయి. ఎవరికి రక్షణ కల్పించడం కోసం పటేల్ సైన్యం ఉన్నదో బిజెపి నాయకులు చెప్పగలరా ? లొంగిపోయిన ప్రజా కంటకుడైన నైజాం నవాబు రాజు, రజాకార్ సైన్యం అధ్యక్షులు కాశం రాజ్వి లను అరెస్టు చేసి చట్టం ప్రకారం ఎందుకు శిక్షించలేదో చెప్పాలి నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం నైజాం నవాబుకు సాగిల పడింది. రాజ ప్రముక్ గా నైజాం నవాబు నియమించి 1972 వరకు కొనసాగింది. రాజభరణం కింద ఏడాదికి 50 లక్షలు, కుటుంబ వారసులకు ప్రత్యేక సౌకర్యాలు కింద మరో 50 లక్షలు చెల్లించారు. ప్రత్యేక విమానంలో నైజాం నవాబు కుటుంబాన్ని రాజా కార్ సైన్యం అధ్యక్షులు కాసిం రాజ్వి పాకిస్తాన్ కు పంపివేసింది. ప్రజా కంటకులైన పాలకులకు రక్షణగా ఉన్న పటేల్ సైన్యం ,నెహ్రూ ప్రభుత్వం లాలూచీ తీరును బయట ప్రపంచానికి తెలియకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారు.
వక్రీకరణలో భాగమే ముస్లింలపై హిందువుల తిరుగుబాటు వాదన:
హైదరాబాద్ సంస్థానం మూడు భాషలతో గుడి ఉండేది. 1951 లెక్కల ప్రకారం సంస్థానం విస్తీర్ణంలో సాగభాగం తెలంగాణ ప్రాంతంలో ఉండేది. ఎనిమిది జిల్లాల్లో తెలుగు మాట్లాడేవారు 90 లక్షల మంది ఉండేవారు. మరట్వాడ ప్రాంతం ఐదు జిల్లాల తో 28% భూభాగం ఉండేది. మరాఠీ భాష మాట్లాడే ప్రజలు 45 లక్షలు ఉండేవారు. కన్నాడ ప్రాంతం( కర్ణాటక) మూడు జిల్లాలతో 22% భూభాగంలో ఉండేది. వీరి జనాభా 20 లక్షలు ఉండేది. మొత్తం హైదరాబాద్ నైజాం సంస్థానంలో ఉర్దూ భాష మాట్లాడే ప్రజలు కేవలం 21 లక్షల మంది మాత్రమే ఉంటారు. వీరు హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాలలో ఉన్న ప్రజల్లోనే ఉన్న అల్పసంఖ్యాకులు అని చెప్పవచ్చు. రాజు ముస్లిం కావడం వలన అధికార భాషగా ఉర్దూ చలామణి కావడం వల్ల మిగిలిన భాషలు వివక్షకు గురయ్యాయి. నైజాం నవాబు పాలన కింద ఉన్న అధికారుల దోపిడీకి వ్యతిరేకంగా పట్టణాలలో అభివృద్ధి చెందుతున్న వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, మధ్యతరగతి మేధావులను సెక్షన్ల వారిగా హిందూ జన సామాన్య రక్షకులుగా ఫోజు కొడుతూ ఆర్య సమాజం కార్యకర్తలు అనేక మత ఘర్షణలకు ,వివాదాలకు తొలి నాళ్లలో కారణమయ్యారు. దీనికి ప్రధాన కారణం 1940 వరకు బ్రిటిష్ సామ్రాజ్య జాతీయవాదులకు తలొగ్గి భారత కాంగ్రెస్ పార్టీ స్వదేశీ సంస్థానాల్లోని సంస్థ నాదీశులైన రాజులు, నవాబుల నిరంకుశ నియంత్రత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేయడానికి నిరాకరించడం, దీనికి తోడు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పట్టణాలలో బలహీనంగా ఉండటం వలన ప్రజలలో జాగృతం అవుతున్న ప్రజాతంత్ర చైతన్యాన్ని మతతత్వానికి ధారాదత్తం చేయడం జరిగింది. కొంత మేరకు అవకాశం ఏర్పడింది.ఇదే సమయంలో తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో విపరీతమైన భూకేంద్రీకరణ, పెట్టి చాకిరి, దోపిడీ విధానం పెరిగింది.వ్యవసాయం కింద ఉన్న భూమి మొత్తం ఐదు కోట్ల 30 లక్షల ఎకరాలు. మూడు కోట్ల ఎకరాలు అంటే 60 శాతం భూమి దివాని లేదా ఉల్పా ప్రాంతం పేరుతో ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. కోటి 50 లక్షల ఎకరాలు అంటే 30 శాతం భూమి జాగీర్దార్ విధానం కింద ఉండేది. మిగిలిన 80 లక్షల ఎకరాల భూమి అంటే 10% మాత్రమే సర్పి ఖాన్ విధానం కింద నైజాం సొంత భూమిగా ఉండేది. నైజాం సొంత భూమి నుండి వచ్చే ఆదాయం సంవత్సరానికి రెండు కోట్లు ఉండేది. దీన్ని నైజాం కుటుంబానికి వాడేవారు . ప్రజా సంక్షేమానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేవారు కాదు.
అగ్రహారాలు , జాగీర్దార్లు, సంస్థానములు, ముక్తాలు , బంజర్లు, ఇనామ్ లు పంటి భూములు వివిధ సేవలు వారికి ఇవ్వబడేవి. పైగాలు అంటే నైజాం యుద్ధాల్లో సాయపడే సాయుధబలగాలు పోషణ కోసం ముస్లిం భూస్వాములు ముఖ్యంగా నైజాం రాజు బంధువులకు అందించబడినవి ఎస్టేట్స్. సాలార్జింగ్ దివాన్ గా (ముఖ్యమంత్రి) ఉన్న కాలంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. పన్నులు వసూళ్లు ఆధారంగా ఉద్యోగ విరమణ అనంతరం వతన్లు లేదా మాష్ పొందబడేవి. ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసే దేశముక్ లు , దేశ పాండేలు తో పాటు ఐదు నుండి పది గ్రామాలు వతన్ పొందిన పటేల్, పట్వారి, మాలి పటేల్ గ్రామాలలో ఉండేవారు . సీరీదార్లు అయినా గుమస్తాలు, ఏజెంట్ల ద్వారా దేశ్ ముక్ లు వతన్ గ్రామాలపై పెత్తనం చెలాయించే వారు.పన్నుల వసూళ్ల ను అడ్డుపెట్టుకొని సాగులో ఉన్న అతి సారవంతమైన భూములను వివిధ తప్పుడు వ్యవసాయంలో వేలాది ఎకరాలు సామాన్య ప్రజల నుండి భూస్వాములు కబళించేవారు. రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో అధిక భాగం మొట్టమొదటి సర్వే సెటిల్మెంట్లో రైతులకు తెలియకుండా తమ పేర్లపై అధికార బలంతో వ్రాయించుకునేవారు. చట్ట ప్రకారం అన్ని హక్కులు పొందేవారు . అంతా అయిపోయిన తర్వాత రైతులకు అసలు విషయం తెలిసేది . సర్వే సెటిల్మెంట్ సందర్భంలో తమ వశం కాకుండా రైతుల చేతుల్లో మిగిలిపోయిన సాగుకు అధిక పన్నులు చెల్లించడం, ధాన్యం , మిర్చి పంటలకు పెట్టుబడికి అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వసూళ్లు చేసేవారు . జాగీర్దార్ ప్రాంతాల్లో నీటి పారుదల ఉన్న భూములకు దివానీ భూములు (ప్రభుత్వ భూములు ) పన్ను కంటే 15 నుండి 150 రెట్లు పన్నులు వసూలు చేసేవారు. ధాన్యం రూపంలో అయితే ఎకరాకు 10 నుంచి 15 బస్తాలు అంటే 8 నుంచి 15 క్వింటాళ్ల ధాన్యం వసూలు చేసేవారు. 194 కంటే ముందు హైదరాబాద్ సంస్థ0 ఆదాయం మొత్తం 8 కోట్లు గా ఉన్న దాన్ని 110 మంది పైగా, జాగీర్దార్లు రైతుల వద్ద వివిధ పన్నుల పేరుతో సంవత్సరానికి 10 కోట్లు వసూళ్లు చేయడం వీటికి ఐదు కోట్ల 50 లక్షల రూపాయల పన్నులను కేవలం 19 మంది స్వాహా చేయడం చూస్తే నిర్బంధ తీవ్రత ఎంత ఉందో తెలుస్తున్నది.1920 – 22, 1929 – 30 సంవత్సరాలలో వచ్చిన కరువు, ఆర్థిక సంక్షోభంతో పంటలు సరిగా పండక పోవడం వలన పన్నులు కట్ట లేకపోయినా రైతులను చిత్రహింసలకు గురిచేసి వారి భూములను స్వాహా చేసేవారు.1) జన్నారెడ్డి ప్రతాప రెడ్డి సూర్యాపేట భూస్వామికి 1,50000 ఎకరాల భూమిని ఆక్రమించాడు. ఏక ఖండం గా 750 ఎకరాల మామిడి తోట అతనికి ఉన్నది.2) కల్లూరు దేశముక్ కు లక్ష ఎకరాలు భూమి ఉన్నది మధిర తాలూకా గ్రామాలు ఈయన ఆదినం లోనే ఉండేవి.3) అదిలాబాద్ జిల్లా లక్షిట్ పేట్ నర్సాపూర్ సంస్థాన భూస్వామి చేతిలో 50 వేల నుండి లక్ష ఎకరాల భూమి ఉంది.4) విసునూరు దేశముఖ్ ఆధీనంలో 40 ఎకరాల భూమితోపాటు నల్లగొండ, జనగామ తాలూకాలోని 40 గ్రామాల భూస్వామి.5) బాబా సాహెబ్ పేట దేశ్ ముక్ ఆధీనంలో పదివేల ఎకరాల భూమితో పాటు మిర్యాలగూడెం తాలూకా గ్రామాలపై భూస్వామి.6) పోలంపల్లికి చెందిన అల్వాల కుటుంబం సుందమేరి మాధవరావు పదివేల ఎకరాల భూస్వామి.1950 51 పరిపాలన నివేదికల ప్రకారం 500 ఎకరాల పైబడిన భూమి పట్ట గలిగిన భూస్వాములు 550 మంది ఖమ్మం , నల్లగొండ, వరంగల్ , మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేవారు. వీటిని బట్టి భూమి కేంద్రీకరణ తెలంగాణ ప్రాంతంలో ఏ మోతాదులో ఉందో అర్థం చేసుకోవచ్చు.నిర్బంధ వెట్టి చాకిరి , నిర్బంధ పన్నులు , కౌవులు లేవి వసూళ్లు అనేది ఆటవిక తెగల కోసం, ఇతర ప్రాంతాల్లో బాగా వెనకబడిన కొన్ని సంఘటిత తెగలకు మాత్రమే పరిమితమైనదిగా పరిగణించబడుతుంది. కానీ నైజాం సంస్థలోని తెలంగాణ ప్రాంతంలో సమాజం అంతట ఆవరించబడి ఉండేది. అన్ని వర్గాల ప్రజలకు తర తమ స్థాయిలో అది వర్తించేది.రైతుల పొలాల్లో పనులు ప్రారంభానికి ముందే భూస్వాములు గ్రామ అధికారుల పొలాలను దున్ని పెట్టాలి. వీరి పొలాలు తడిసిన తర్వాతనే రైతుల పొలాలకు సాగు నీరు మళ్ళించేవారు . ఫలితం ఆశించకుండా వ్యవసాయ కార్మికులు వీరి పొలాల్లో పనిచేయాలి. ప్రతి హరిజన కుటుంబం వెట్టి చాకిరి చేయడానికి కుటుంబంలో ఒకరిని, చిన్న పల్లెల్లో ప్రతి ఇంటి నుండి ఒకరికి కేటాయించవలసి ఉండేది. భూస్వాములు, దేశముక్ లు , పటేల్, పట్వారి , మాలి పటేల్ గృహ సంబంధ పనులు చేయాలి. బాలికలను బానిసలుగా పంపించాలి వారి కుమార్తెల పెళ్లిళ్లు చేసినప్పుడు బాలికలను బహుకరించి వారి కుమార్తెతో పాటు అత్తారింట్లో పనులకు పంపేవారు. భూస్వాములు బానిస యువతులను ఉన్నప్పుడు గత్తెలుగా కూడా ఉపయోగించు కునేవారు . పోలీస్ స్టేషన్‌లు, తాలూకా ఆఫీసులకు రిపోర్ట్‌లు మోసుకెళ్ళడం, గ్రామ సావడికి , బందెల దొడ్డికి కాపలా కాయడం వీరి రోజువారి పనిలో భాగమే. చర్మ కారులుగా పని హరి జనులు చెప్పులు కుట్టి ఇచ్చినందుకు, వ్యవసాయ పనులకు నూతల నుండి నీరు తోడడానికి మోటబావి పరికరాలు, అరక పట్టేళ్ళు సరఫరా ఉచితంగా సరఫరా చేయాలి. బోయలు , బెస్తలు, రజకులు , ఇతర వెనకబడిన కులాలవారు భూస్వామి వారి కుటుంబ సభ్యులు స్త్రీ పురుషులను మీనాలోనూ, పల్లకీలలో ఎక్కించుకొని తమ భుజాలపై మోసుకుంటూ వారి బంధువుల ఇండ్లకు, తీర్థాలు తిరనాళ్లకు తీసుకెళ్లడానికి నిర్బంధంగా మోహించేవారు. భూస్వామి కుటుంబాలు వేగంగా నడిచే ఎడ్ల బండి పై ప్రయాణం చేస్తుంటే బండి ముందు, వెనుక కాపలాదారులుగా పరిగెత్తాలి. వారు గుర్రాలపై స్వారీ చేస్తే గుర్రాల దగ్గర పని చేసే వారు దాని వెంట పరుగెత్తాల్సి వస్తుంది. కల్లుగీత కార్మికుల వారి కుటుంబాలకు 10 గీత చెట్లు ప్రత్యేకంగా కేటాయించాలి. రోజుకు ఐదు కుండల కల్లు ఉచితంగా సరఫరా చేయాలి . పండగల సందర్భంలో ఎక్కువ కల్లు ఇచ్చి రావాలి. చేనేత వారు బట్టలు, కుమ్మరలు కుండలు, వడ్రంగులు ,కమ్మర్లు వ్యవసాయ పరికరాలను ఉచితంగా ఇవ్వాలి పాడైన వాటికి మరమ్మత్తులు చేయాలి. మంగళ్ళు ప్రతిరోజు వారి ఇండ్లలో సేవలు చేయాలి. రాత్రి వేళల్లో పాదాలు ఒత్తడం , ఒళ్ళు మర్దన చెయ్యాలి. భూస్వాముల ఇండ్లలో వేడుకలు, గ్రామ పండగలు జరిగిన ప్రతిసారి గొల్ల కురుమలు ప్రతి మంద నుండి ఒక గొర్రె ఉచితంగా ఇవ్వాలి . ఏదో ఒక సాకుతో వారు ఎప్పుడు అడిగినా ఒక గొర్రెను ఇచ్చి రావాల్సిందే. వ్యాపారస్తులు మంచి నెయ్యి, ఇంటికి అవసరమైన సరుకులు వంతుల వారీగా సరఫరా చేయాలి. ఏదైనా సరుకు ఇవ్వడానికి నిరాకరిస్తే చిత్రహింసలు పెట్టేవారు.
ఏ వస్తువు లేని ప్రజలు కోడి పెట్టను ఇవ్వాలి. ఎడ్ల బండ్లల్లో ఎక్కించ కెళ్ళాలి. బాలింతలను తమ పిల్లలకు పాలు ఇవ్వకుండా నిర్బంధంగా పనిచేపించారు. కొత్తగా పెళ్లి అయి వచ్చిన వధువు మొదటి రాత్రి దొరల గడిలో గడిపి రావాలి సిందే ఈ చర్యలకు భయపడి భూస్వాములు దొరల పరిధిలో ఉన్న గ్రామాలకు ఆడపిల్లలను ఇవ్వడానికి భయపడేవారు.ఈ విధానాలు తెలంగాణ ప్రజల జీవన విధానం అట్టడుగు స్థాయికి దిగజారింది బానిసత్వంలోకి నెట్టింది మానవుని ఆత్మగౌరవం పూర్తిగా ధ్వంసం చేసిన ఈ విధానాల రద్దు కోసం ఉద్యమం విస్తృతంగా వ్యాపించింది.ఈ రకమైన నిర్బంధాన్ని దోపిడి , వెట్టి ప్రదర్శన కొనసాగించిన వారు ఎవరు అనేది బిజెపి నాయకులు చెప్పాలి.1920 లో విసునూరు దేశముఖ్ గుండాల చేతిలో హత్యగావించబడ్డ కానవాయి కి చెందిన షేక్ బందగి, జఫర్‌గడ్ జాగీర్దార్ ఖాదర్ ఖాదర్ ఆలీ గుండాల చేతిలో హత్యకు గురైన తమ్మడపల్లి (జి) గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాసిం, హైదరాబాద్ నడిబొడ్డున పోరాడిన అనేక మంది ముస్లింలు హత్యగావించబడిన సోయాబుల్లాఖాన్. హైదరాబాద్ సంస్థానంలో 975 మంది జాకీర్ దార్లు ఉంటే వీరిలో 872 మంది హిందువులు 102 మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. వీరి చేతిలో 21 వేల గ్రామాలు ఉండేవి.భూస్వాములకు అండగా నిలిచిన నెహ్రూ పటేల్ సైన్యాలు ఆంధ్ర మహాసభ నాయకత్వం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా ఖమ్మం , వరంగల్ , నల్లగొండ జిల్లాలకు చెందిన 16 వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 30 లక్షల మంది జనాభా గల 3000 గ్రామాల్లో పంచాయతీల ప్రతిపాదికన గ్రామ రాజ్యాలను నెలకొల్పారు. నైజాం నవాబు పాలన మూల స్తంభాలైన భూస్వాములు , దొరలను వారి కోటలైన గడిల నుండి తరిమికొట్టారు . వాళ్ల చేతిలో ఉన్న పొలాలను 10 లక్షల ఎకరాలకు పైగా గ్రామ కమిటీల ద్వారా భూమిలేని పేదలకు పంపిణీ చేస్తారు, భూముల నుండి బేధాలు చేయడం, వెట్టి చాకిరి, అధిక వడ్డీల వ్యాపారం వంటి చర్యలు రద్దు చేయబడ్డాయి. వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచి కనీస వేతనాలు అమలుపరిచారు. ఆటవిక తెగల ప్రజలను పీడించే ఫారెస్ట్ అధికారులను అడవుల నుండి వెళ్ళగొట్టారు. ప్రజలు స్వేచ్ఛగా తమ శ్రమను అనుభవించారు . 2000 మంది గేరెల్లా సాయుధ దళ సభ్యుల అండతో లక్షలాదిమంది ప్రజలు మొదటిసారి రెండు పూటలా భోజనం చేయగలిగారు . ఒక్క మాటలో చెప్పాలంటే నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మధ్యయుగాలనాటి నిరంకుశ పాలనపై చావు దెబ్బ కొట్టింది.
ప్రజా పోరాటానికి భయపడి గ్రామాలు వదిలి పట్టణాల్లో దాక్కొన్న భూస్వాములు తిరిగి గ్రామాలకు తీసుకువచ్చి తిరిగి భూస్వామ్య వ్యవస్థను పునరుద్ధరణ చేయడానికి నెహ్రూ పటేల్ సైన్యాలు 1948 సెప్టెంబర్ 17 నుండి 1951 అక్టోబర్ 1 వరకు కృషి చేశాయి తప్ప ప్రజల బాధలకు కారణమైన వారిని కూడా నిర్బంధించే ప్రయత్నం చేయలేదు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ 50 వేలమంది సాయుధ బలగాలను దించాడు. 1947 -48 సంవత్సరాల మధ్య జమ్మూ కాశ్మీర్ ,పాకిస్తాన్ సమస్యల పరిష్కారానికి ఎంత డబ్బు వెచ్చించారో , నరులను ఒక్క హైదరాబాద్ లో ఉపయోగించారని అనధికార వర్గాలు అంచ నా వేసాయి. తెలంగాణ ప్రాంతంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం శీఘ్రగతిన పురోగమిస్తున్నది . రెండు జిల్లాలకు పైగా కమ్యూనిస్టుల కంట్రోల్ లోకి వెళ్లాయి . వారి పట్టు సంస్థ మొత్తం వ్యాపించే ప్రమాదం ఉంది అని కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ పదేపదే ప్రకటన చేశాడు. నైజాం నవాబును భారత యూనియన్‌కు ఒప్పించడంతోపాటు కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడం కోసం భారత సైనిక జోక్యం ప్రధానమైనదని ఆనాటి గవర్నర్ జనరల్ రాజాజీ చేసిన ప్రకటన కాంగ్రెస్ నెహ్రూ పటేల్ అసలు రూపాన్ని పెట్టింది. వాస్తవానికి మనందరి 47 15 లోపు నైజాం నవాబు విలీనం కావడానికి ఆగస్టు నిరాకరించిన నెహ్రూ ప్రభుత్వం ఆయనతో సంధి చేయడానికి సిద్ధపడింది కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచడం కోసం మందు గుండు సామాగ్రి, ఆయుధాలను అందజేయడానికి సిద్ధపడింది . లొంగిపోయిన తర్వాత ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఫలితంగానే నైజాం నవాబు రాజాకార్ల సైన్యాన్ని , నెహ్రూ ప్రభుత్వ సైన్యాలు సహకారం తీసుకుని కమ్యూనిస్టుల పై దాడి చేయడం చూశాడు. మిలిటరీ గవర్నర్ జె ఎన్ చౌదరినీ శ్రీమతి సరోజినీ నాయుడు డాక్టర్ జై సూర్యతో కలిసి సాయిధుడైన పోరాట విరమణకు కమ్యూనిస్టులతో చర్చలు జరపడానికి వ్యవధిని అడిగితే అంగీకరించలేదు . ఈ ఆరు వారాల లోపే కమ్యూనిస్టులను రూపుమాపుతానని ప్రకటన చేశారు.పట్టణాల్లో దాక్కున్న భూస్వాములను గ్రామాలకు తీసుకొచ్చి పటేల్ , రాజా కార్యకర్తలు కలిసి మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు . ఆంధ్ర మహాసభ , కమ్యూనిస్టు కార్యకర్తల ఇండ్లపై దాడి చేశారు. భోజనాలు పెట్టిన రైతులను వ్యవసాయ కార్మికుల చేతి వృత్తిదారులను నిర్బంధించారు మహిళలపై మిలిటరీ సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు ముకుమ్మడిగా అరెస్టులు చేసి చిత్రహింసలకు గురి చేయడం వలన 6000 మంది సాధారణ జనం క్యాంపు కార్యాలయాల్లో చనిపోయారు. 4000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలను కోల్పోయారు. ఒక గ్రామం తర్వాత మరొక గ్రామాన్ని తగలబెడుతూ దేశముక్కులు రజాకార్లతో కలిసి పటేల్ సైన్యాలు పైశాచికానందాన్ని పొందాయి. ఇదే సమయంలో నైజాం దురంతాలకు వ్యతిరేకంగా నిలిచిన ముస్లిం రైతాంగంపై దాడులు జరిపి వర్ణనాతీతమైన బాధలకు గురి చేశారు. గ్రామాలలో సాధారణ హిందూ ప్రజలు ముస్లింలను తమ ఇండ్లలో దాచిపెట్టి ఈ దాడులకు రక్షణ కల్పించారు. యూనియన్ సైన్యాల హత్యలు మానభంగాలు నుండి వేలాది మంది ముస్లిం కుటుంబాలను కాపాడారు. హిందూ ముస్లిం మతకలహాలను రేగొట్టి దావాలనం లాగా వ్యాపింప చేసిన కుట్రలను హిందూ ముస్లిం ఐక్యతతో కమ్యూనిస్టు ఉద్యమం తిప్పి కొట్టింది. కమ్యూనిస్టు ఉద్యమం బలహీనంగా ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని ఇతర ప్రాంతాలలో ముస్లిం వ్యతిరేక విద్వేషం , వారిపై దాడులు విస్తారంగా జరిగాయి.విలీన ప్రక్రియ పేరుతో పటేల్ మిలటరీ పోలీసు యంత్రాంగం ప్రైవేట్ రజాకారు సైన్యం కలిసి జరిపిన మారణ హోమం హత్యకాండ ఘటనలపై నెహ్రూ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దిక్కు తోచని స్థితిలో సుందర్ లాల్ విచారణ కమీషన్ వేసింది . 1948 నవంబర్ నుండి డిసెంబర్ వరకు నెలరోజులపాటు జరిగిన హింసాత్మక ఘటనలు తొమ్మిది జిల్లాలలో పర్యటన జరిపారు . 21 పట్టణాలు , 23 ముఖ్యమైన గ్రామాలను సందర్శించింది. 109 గ్రామాల్లో 500 మంది సాక్షులకు పైగా విచారించింది. 31 పబ్లిక్ మీటింగ్స్ , 27 ప్రైవేట్ మీటింగ్స్ నిర్వహించారు . హిందూ ముస్లింల పెద్దలను, అధికారులు ,విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులు, అభ్యుదయ రచయితల సంఘాల నేతలు , హిందీ ప్రచార సభ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వామి రామానంద తీర్థ, నైజాం రాజు, మేజర్ జనరల్ జే ఎన్ చౌదరి, సి ఎస్ బక్లే ముఖ్య పరిపాల అధికారులు, డాక్టర్ మెల్కోటే, మెన్సర్స్, రామచందర్రావు , రామాచారి, కె విద్య, కె వెంకట్రావులను విచారణ జరిపి నివేదిక అందించారు.ఉస్మానాబాద్, గుల్బర్గా, బీదర్, నాందేడ్ ఈ నాలుగు జిల్లాల్లో సుమారుగా 18000 మంది ముస్లింలను కోల్పోయారు. ఔరంగాబాద్, బీర్ ,నల్లగొండ మెదక్ జిల్లాల్లో 3,500 నుండి 4000 మందిని హతమార్చారు. హైదరాబాద్ సంస్థానంలో మొత్తం 30 వేల మంది ముస్లింలు సందడి చేశారు. అనేక మసీదులను కూల్చి వేయబడ్డాయి. బలవంతపు మతమార్పిడులు జరిగాయి. దేనికి ప్రధాన కారణం హైదరాబాద్ సంస్థానం బయట నుండి సాయిధ శిక్షణ పొందిన హిందూ మతోన్మాద సంస్థకు చెందిన వారేనని నివేదికలో పేర్కొన్నారు. యూనియన్ సైన్యం, స్థానిక పోలీస్ యంత్రాంగంలో ఉన్న మతమౌద్యుల సహకారంతో ఈ దుర్మార్గాలు జరగడానికి మరొక కారణం.