Listen to this article

పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు.

జనం న్యూస్.సెప్టెంబర్ 14. సంగారెడ్డి జిల్లా. హత్నూర.

హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చాక్ చెరువుకు బుంగ పడడంతో నీళ్లు మొత్తం వృధాగా పోతున్నాయని గ్రామస్తులు తెలిపారు.ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాలలో చెరువులు కుంటలు నిండుకుండల్ల మారాయి.చెరువు కట్టకు బుంగ పడిందని గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చిన అధికారులు స్పందించడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చాకిచెరువు కింది ఆయకట్టులో సుమారు 300 ఎకరాల వ్యవసాయ,పొలాల ఉన్నాయని రైతులు గ్రామస్తులు తెలిపారు. బుంగ పడి నీరు వృధాగా పోవడం వలన పంటలు ఎలా పండించాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి బుంగను పూడ్చాలని రైతులు షేక్ అలీ, యాటకాని శంకర్, శ్రీనివాస్ గౌడ్,మహమ్మద్ నజీర్.,కురుమ ఆమదయ్య, రమేష్. పోచయ్య.
సలావుద్దీన్ తదితరులు కోరారు.