Listen to this article

జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

నేడు జోగులాంబ గద్వాల జిల్లా లో ఉప్పల వినాయకుని గుడిపై దాడి ఈ మధ్య కాలంలో జిల్లా లో నగర్ దొడ్డి, పెద్దదీన్నే దేవాలయాల పై దాడి పై దాడులలో పలు విగ్రహాలు ద్వసం జిల్లా లో పలు ఆలయాల హుండీలు అపహరణ..దోషులను కఠినంగా శిక్షించాలి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు యస్ రామచంద్రారెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం ఉప్పల గ్రామంలోని వినాయకుని ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే మల్దకల్ మండలం నాగదొడ్డి గ్రామంలోని శివాలయంలో, ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామంలోని శివాలయంలో, భాగ్యనగర్లోని ముత్యాలమ్మ దేవాలయం, శివాలయాలు మరియు పలుచోట్ల హిందూ దేవి–దేవతల విగ్రహాలను దుర్మార్గంగా ధ్వంసం చేసిన ఘటనలు హిందూ సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయి.ఇలాంటి సంఘటనలు వరుసగా జరగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తప్ప మరేమీ కాదు. హిందూ ఆలయాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఆలయ భద్రతా చర్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వలన మతపరమైన భావజాలాన్ని అవమానించే విధంగా దాడులు జరుగుతున్నాయి.మతపరమైన విశ్వాసాలు, ఆరాధ్య దైవాల పట్ల గౌరవం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, పాలకులు మౌనంగా ఉండటం, దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించకపోవడం వలన హిందూ సమాజం తీవ్ర నిరాశకు గురవుతోంది.తరచుగా గుళ్ళ పరిసర ప్రాంతాలలో మద్యం సేవించడం, ప్రభుత్వం దీనిపై బాధ్యతరాహిత్యంగా వ్యవహరించడం దీనికి ప్రధాన కారణం.భారతీయ జనతా పార్టీ డిమాండ్లుదేవాలయాలపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలి.దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి ప్రతి దేవాలయానికి తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి.ఆలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ బలపడేలా తక్షణ చర్యలు చేపట్టాలి*
సీసీ కెమెలాలు ఏర్పాటు చేయాలిమతపరమైన విశ్వాసాల పై దాడులు కొనసాగితే, రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సమాజం తీవ్ర ఆందోళన చేపట్టకుండా, ముందుగానే ప్రభుత్వం రక్షణ చర్యలు చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అయిజ పట్టణ మరియు మండల అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి & గోపాలకృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రదీప్ స్వామి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ,జి వెంకటేష్ యాదవ్ లక్ష్మణ్ గౌడ్ శంకర్ ముదిరాజ్, తెలగు కృష్ణ, రఘు వీరరెడ్డి, స్థానిక బీజేపీ కార్యకర్తలు ఉప్పల యువత పాలుగోన్నారు…