

జనం న్యూస్ న్యూస్, సెప్టెంబర్ 19, అచ్యుతాపురం:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా,పారదర్శకంగా రేషన్ సరకులు అందించడానికి క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈరోజు పూడిమడక గ్రామ సచివాలయం వద్ద కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కుటుంబ పెద్దలకు మేరుగు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అనకాపల్లి జిల్లా టీఎన్టియుసి ప్రధాన కార్యదర్శి, పంచాయతీ వార్డు సభ్యులు మరియు టీడీపీ జిల్లా టీఎన్టియుసి మాజీ అధ్యక్షులు వాసుపల్లి అప్పారావు తదితర కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.