Listen to this article

జనం న్యూస్, కోహెడ మండలం, సెప్టెంబర్ 19,

హైదరాబాద్ శ్రీకృష్ణ నగర్ లో స్థిరపడిన కోహెడ మండలంలోని వివిధ గ్రామ మున్నూరు కాపు కుటుంబాలు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రాజకీయాల్లో అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రస్థాయికి ఎదిగినప్పటికీ.ఒక శ్రామికుడిగా కార్యకర్తగా ఎప్పుడు ప్రజల మధ్యలో కొనసాగిన గొప్ప మనిషి కర్ర శ్రీహరి, అని పలువురు వక్తలు కొనియాడారు, తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న కర్ర శ్రీహరి, ఇటీవల పరమపదించడం మున్నూరు కాపులకు ముఖ్యంగా బహుజనులకు తీరనిలోటని. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు, అన్నారు శుక్రవారం శ్రీకృష్ణ నగర్ మున్నూరు కాపు సంఘములో జరిగిన కర్ర శ్రీహరి, మరియు పెరూక నారాయణల, సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు, కార్యక్రమంలో మాజీ మార్కెట్ సంస్థ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాట్లాడుతూ యువత కర్ర శ్రీహరి, బొమ్మ వెంకన్నల, అడుగుజాడలో నడవాలన్నారు, రాష్ట్ర అధికార ప్రతినిధి మంగళరపు లక్ష్మణ్, మాట్లాడుతూ కర్ర శ్రీహరి 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇందుర్తి. నేటి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు ఏ ఇంటికి వెళ్ళినా కర్ర శ్రీహరి, పేరు తలవని వారు ఉండరు అన్నారు,రాజకీయాల్లో ఆయన ఎంతో నష్టపోయారన్నారు, పెరుకా నారాయణ, తనకు ఆప్తమిత్రుడని వ్యాపార రంగంలో ఆయన ఎందరికో దారి చూపాడన్నారు కార్యక్రమంలో కృష్ణానగర్ సంఘం అధ్యక్షులు బుడుగు రవి, ప్రధాన కార్యదర్శి సతీష్, మాజీ అధ్యక్షులు కోలా శివకుమార్, మామిడాల కనకయ్య, బుడుగు తిరుపతి, వాసాల తిరుపతి, ఆఫీస్ పెట్ సంఘం అధ్యక్షుడు పోగుల సతీష్, రాష్ట్ర కార్యదర్శిలు ఈసంపల్లి వెంకన్న, ఆకుల సతీష్, కాపు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు, పెరుక శ్రీనివాస్, గాజుల కైలాసం, పెరిక రాములు, మంగళారపు రాములు, జంగిటి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు