Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 19:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలము: జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఏర్గట్ల మండలంలోని వివిధ గ్రామాలకు ఐదుగురు గ్రామ పాలన అధికారులు (జి పి ఓ లు) నియమించబడ్డారని తహసీల్దార్ మల్లయ్య తెలిపారు.ఇప్పటికే బాధ్యతలు స్వీకరించి, తమ తమ గ్రామాలలో విధులు నిర్వహిస్తున్నారు.నియమించబడిన గ్రామ పాలన అధికారులు & గ్రామాలు:టి. సంపత్ – బట్టాపూర్, తడ్పాకల్ గ్రామాలు డి. గంగాధర్ – గుమ్మిర్యాల, దోంచంద గ్రామాలు 3. జి. మధు – తాళ్లరాంపూర్ గ్రామం ఏ. భూమన్న – తొర్తి గ్రామం ఎస్. వెంకటేష్ గౌడ్ – ఏర్గట్ల గ్రామం
ప్రజలకు తెలియజేయునది ఏమనగా — కులం, ఆదాయం, నివాసం, జననం-మరణం, వ్యవసాయ ఆదాయం, ఓ బి సి, ఇ డబ్ల్యూ ఏస్ తదితర అన్ని రకాల దృవీకరణ పత్రాలు మొదటగా గ్రామ పాలన అధికారులచే వ్రాయించుకొని, తహసీల్దార్ కార్యాలయంలోమండల రెవెన్యూ పా పరిశీలకులచే ధ్రువీకరణ పొందవలసిఉంటుందని తెలిపారు.