Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 19 చిలిపిచేడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించబడుతుంది
పోషణ మాసం (సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు నిర్వహించబడుతుంది) పోషణ మాసం సందర్భంగా ఎర్రమట్టి తండాలో, స్థానికంగా దొరికే ఆకుకూరల గురించి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు స్థానికంగా దొరికే కూరగాయలు పండ్లు, తీసుకోవాలని అందులో ఉన్న పోషక విలువల గురించి చెప్పటం జరిగింది. ముఖ్యంగా మహిళలలో రక్తహీనత రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ఆధార పదార్థాలు తీసుకోవాలో వివరించడం జరిగింది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే కాకుండా మగవారికి కూడా పోషకాహారం పై అవగాహన ఉండాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కిశోర బాలికలు, గర్భిణీ లు, ఇతర తల్లులు, పంచాయతీ కార్యదర్శి, ప్రైమరీ స్కూల్ టీచర్, ఆశ, ఇంచార్జ్ అంగన్వాడి టీచర్ (దుర్గ) ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సంతోషిమాత పాల్గొనడం జరిగింది