

జనం న్యూస్ సెప్టెంబర్ 19 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
కాంగ్రెస్ యువ నాయకుడు పొన్నం అనూప్ గారి జన్మదిన వేడుకులు ఎల్కతుర్తి జంక్షన్ లోని అంబెడ్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ అద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమం లో హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివారెడ్డి మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ మాట్లాడుతూ పొన్నం అనూప్ గారి నిరాడంబరత, నమ్మిన వారికీ అండగా నిలబడే వ్యక్తిత్వం, ప్రజా సేవ లో వారి అంకిత భావం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పొన్నం అనూప్ గారి వ్యక్తిత్వం యువతకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేసిన అనంతరం విద్యార్థులకు పండ్ల పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో హుస్నాబాద్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ నాయకులు ,ఎల్కతుర్తి కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.