

(జనం న్యూస్ 19 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండల కేంద్రంలోని శుక్రవారం రోజున ఇప్పల బొగడా ఒకటవ వార్డులో కరెంటుతో ప్రజలు పడుతున్నఇబ్బందులను గమనించిన కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్, కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలపగా అతి కొద్ది రోజులలో 50 విద్యుత్ స్తంభాలను మంజూరు చేసిన , సందర్భంగా కాలనీ వాసులు మంత్రికి పాలాభిషేకం చేశారు . ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మరొక్కసారి నిరూపించారు
గత ప్రభుత్వం కరెంట్ బిల్లులు పెంచి ప్రజల నుండి రక్తం రూపం లో బిల్లులు వసూలు చేసిందని , కాని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 200 యూనిట్ల ఉచిత కరెంట్ ను సరఫరా చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బూనేని సుధాకర్ , జరుపుల రమేష్ , కామెర రాములు, తోట శ్రీరాములు , స్థానికులు భైరీ సాగర్ గౌడ్ , వేల్పుల పర్వతాలు , సాట్ల భూమయ్య , ఆవిడపు రాములు , కేశవేణి సత్యనారాయణ , సత్యనారాయణ గౌడ్ , కామెర రాములు , జరుపుల రమేష్ , బండి రాజశేఖర్ , జంగిలి గట్టయ్య , మహిళలు ఆవిడపు శంకరమ్మ , మదాసు లక్ష్మీ , ఆవిడపు సక్కుబాయి లు తదితరులు పాల్గొన్నారు
