Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 19(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ పిలుపుమేరకు శుక్రవారం యాడికి మండల కేంద్రంలోని దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెన్ డౌన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు సంబందించి అమలులో గల ప్రైమ్ విధానములో గల సమస్యలు పరిష్కారం కోరుతూ 19,20తేదీలు రెండు రోజులు రాష్ట్ర దస్తా వేజు లేఖర్ల సంఘం పిలుపుమేరకు పెన్ డౌన్ నిర్వహిస్తున్నామన్నారు .పార్టీషన్ మరియు హక్కు విడుదల దస్తావేజుల వ్యవసాయ భూములకు ఆటో మ్యూటేషన్ సక్రమముగా జరిగేట్టుగా చూడాలన్నారు అదేవిధంగాప్రైవేటు అట్టెండెన్స్ సులభతరముగా పాత పద్దతిలో ఉండాలన్నారు. ఎన్ఆర్ఐ లకు పాస్ పోర్టుతో కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ,డేటా ఎంట్రీ సమయములో ఓటిపి లు రాకుండా రిజిస్ట్రేషన్ సమయములో ఆఫీసు అధికారుల వద్ద వచ్చేటట్లుగాను,డేటా ఎంట్రీలో జరిగిన తప్పులకు సవరణ (అమెండ్) పాత విధానములో ఉండాలన్నారు. ఇండెక్స్ తప్పులను సవరించే అధికారం సబ్ రిజిష్టారు కి ఉండే విధంగా ఇవ్వాలన్నారు. అనంతరం దస్తా లేఖర్ల వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ రిజిస్టర్ జాఫర్ సాదిక్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దస్త లేఖరులు జూటూరు అబ్దుల్ రజాక్, నరేష్, ఈశ్వరప్ప, నవీన్ కుమార్, రామ కేశవులు, దుర్గ, రుక్కు, గంగ, ప్రసాద్, రంగా నాగార్జున పాల్గొన్నారు.