Listen to this article

ఏర్గట్ల జడ్‌పి హైస్కూల్ విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రయత్నం

జనం న్యూస్ సెప్టెంబర్ 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విప్రో ఎర్తిఆన్ ప్రాజెక్ట్‌లో భాగంగా పర్యావరణ పరిరక్షణ అంశంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.విద్యార్థులు ప్లాస్టిక్ అధిక వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి, బట్ట సంచులు, పేపర్ సంచులు వాడాలని గ్రామస్తులకు సూచించారు. పాత వార్తాపత్రికలతో కవర్స్ తయారు చేసి, వాటిని కిరాణా దుకాణాల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి విద్యార్థులను అభినందించారు. భౌతిక-రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు రాజశేఖర్ గైడ్ టీచరుగా మార్గనిర్దేశం చేశారు. విద్యార్థుల పట్ల ఇతర ఉపాధ్యాయులు కూడా ప్రశంసలు కురిపించారు.