.
జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా శంకుస్థాపన వేశారు.. నిధులు తీసుకువచ్చింది మా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ
నాపై వస్తున్న ప్రజాదారణను చూసి ఓర్వలేని కొందరు 40 ఏళ్ల క్రితం మా తండ్రి కొని , కాస్తులో ఉన్న భూమిపై ఇప్పుడు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. గత కొద్దిరోజులుగా తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో శనివారం మైలారం చెరువు కట్టపై మండల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత పది రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. అనుభవం ,అవగాహన లేని వారు బురద జల్లే ప్రయత్నం చేశారని, తాను పట్టించుకోలేదని అన్నారు. కానీ ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన అనుచరుల మాటలు విని మాపై ఆరోపణలు చేయడం తన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. మా తండ్రి 40 ఏళ్ల క్రితం కొన్న భూమిపై మాట్లాడే మీరు.. 2021 లో అధికార బలంతో మీ కుటుంబ సభ్యులు గోవిందాపూర్ శివారులోని 633 సర్వే నెంబర్ లో అతి తక్కువ ధరకు 10-15 ఎకరాల భూమి ఆక్రమించింది వాస్తవం కాదా అన్నారు . మీరు చేస్తే సంసారం… ఎదుటివారు చేస్తే వ్యభిచారమా.. ? అని ప్రశ్నించారు. నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే చర్చకు రావాలని కబ్జా కారులు ఎవరో తేల్చుదామని సవాల్ విసిరారు.చెరువు కట్ట రోడ్డు పనులు గత సంవత్సరంగా జరుగుతున్నాయి. కానీ తనపై హడావిడిగా ఆరోపణ ఎత్తుకున్నారని అన్నారు. రోడ్డు పనులు ఏ నక్ష ప్రకారం చేసిన, చెరువు, భూములు ఎలాంటి సర్వే చేసిన తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దీని వెనక ఎవరు ఉన్నారో.. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారో… మండల ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎంత అణగదొక్కాలని చూస్తే.. అంతే ఎదుగుతామని అన్నారు._ఆరోపించబడిన భూమి తన తండ్రి గత 20 సంవత్సరాల క్రితం దళితుల వద్ద పట్టా భూమి కొనుగోలు చేశారని,ఆ కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలు ఉన్నాయని అన్నారు. దీనిని కూడా కావాలని వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు._
తాను భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించే మాజీ ఎమ్మెల్యే శాయంపేట పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చలి వాగు ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో దళిత భూములను ఆక్రమించి కాస్తూ చేస్తున్నారని అన్నారు. తన భూమి, తన కుటుంబ సభ్యుల భూమి అలాగే మాజీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, అతని కుటుంబ సభ్యుల భూములపై సర్వే, విచారణ చేయిద్దమని, ఎవరు భూములు ఆక్రమిస్తే వారు తిరిగి ఇచ్చేయాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కి కుదరకపోతే బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వే, విచారణ చేయిద్దామని నా ఈ సవాల్ స్వీకరించాలని అన్నారు.వంతెన శిలాఫలకాలపై గత ఎన్నికలలో లబ్ధి పొందాలని దురుద్దేశంతో 2023 సంవత్సరంలో కేవలం ప్రొసీడింగ్స్ తో హడావిడిగా వంతెన శంకుస్థాపన చేశారు. ఓడిపోయి ఇంట్లో ఉంటే నిధులు ఎలా …? ఇప్పుడు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నిధులు తెచ్చింది మా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అని అప్పటి, ఇప్పటి జి ఓ లు చూపించారు. బీ టీ రోడ్డు పనులకు నిధులు అదనంగా తీసుకువచ్చింది తెలియక పోవడం అజ్ఞానం అన్నారు. ఓ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై మాట్లాడు.. ప్రతి అంశాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే తిరిగి మీలోపాలే బయటకు వస్తాయన్నారు. నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించుకొని బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు గ్రామ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…


