Listen to this article

కురుమిళ్ళ శంకర్ భూపతి శ్రీనివాస్ రావు బీసీ సంఘం జిల్లా నాయకులు

జనం న్యూస్ సెప్టెంబర్ 20( కొత్తగూడెం నియోజకవర్గం)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతం నివాసి అభ్యుదయ కవి, రచయిత, గాయకులు,బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు తూముల శ్రీనివాస్ తన కలం తో అక్షరాలకు పదులు పెడుతూ సమాజ హితం కోసం, సామాన్యుడి చైతన్యం కోసం, ఎన్నో సామాజిక చైతన్య గీతాలను వ్రాసి ఆలపిస్తూ, జాతీయ అంతర్జాతీయ కవి సమ్మేళనం లో పాల్గొంటూ, ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్న తూముల శ్రీనివాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరున ఢిల్లీలో ఏర్పాటు చేసిన దళిత సాహిత్య అకాడమీ జాతీయ పురస్కారం పొందడం అలాగే ,,హరివిల్లు,, వారు నిర్వహించిన జాతీయ కవనవనంలో 200 కవితలు వ్రాసి ,,కవి మిత్ర,, ,,కవి రత్న,, బిరుదులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా సాధికార సమైక్య వారిచే ,,శ్రామిక కవి,,బిరుదును పొందడం అభినందనీయం అంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి కురిమిళ్ళశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపతి శ్రీనివాస రావు లు అభివర్ణించారు,చిరుప్రాయం నుండే కలలపై మక్కువతో ప్రజానాట్యమండలి సిపిఐ ప్రజాసంఘంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ నటుడిగా, గాయకుడిగా, కవిగా, నాయకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ సమాజ హితం కోసం ఎన్నో పాటలను రాస్తూ పాడుతూ జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందడం అభినందనీయమని సిపిఐ పార్టీలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడిగా పలువురి
మన్ననలు పొందుతూ ఆల్ ఇండియా రేడియోలో మరెన్నో ప్రదర్శన లిస్తూ దూరదర్శన్ లాంటి టెలివిజన్లో టెలివిజన్ ఆర్టిస్టుగా పనిచేసి 500 పై చిలుకు కవితలు పాటలు రాసి జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తూముల శ్రీనివాస్ ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ అభినందనలతో ఘన సత్కారం రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కొదుమూరి సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు పితాని సత్యనారాయణ జిల్లా నాయకులు బండి రాజు గౌడ్,లు తూముల శ్రీనివాస్ నీ ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు,