జనం న్యూస్ సెప్టెంబర్ 20(నడిగూడెం)
నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ లో శుక్రవారం నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకలు ఆకట్టుకున్నాయి. రంగురంగుల పువ్వులతో పేర్చిన బతుకమ్మలతో చిన్నారులు సందడి చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియపరిచేందుకు ముందస్తు వేడుకలు నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ బుస్సా సులోచన,కరస్పాండెంట్ బుస్సా మహేష్ అన్నారు. విద్యార్థులు ఆసక్తితో 100కు పైగా బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు అనంతరం స్థానిక చౌదరి చెరువులో కోలాట ప్రదర్శనతో నిమజ్జనోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సైదులు, సిరాజ్, రాంబాబు, రజియా, మల్లికా, త్రివేణి నాగమణి, స్వప్న, సాజిదా ,వీర కుమారి, జ్యోతి, వైదేహి, విజయ, సుమలత పాల్గొన్నారు.


