జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. శ్రీనివాసరావు సెప్టెంబర్ 23న ఆసుపత్రిలో నిర్వహించనున్న మెగా క్యాంప్ గురించి వివరాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వస్థ నారి, స్వసక్త్ పరివార్, అభయాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ మెగా క్యాంపును ఉదయం 8 గంటల నుండి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏరియా హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభిస్తారని తెలిపారు.ఈ క్యాంప్‌లో మహిళలకు ప్రత్యేకంగా గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్ల స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. సాధారణంగా బయట ఈ పరీక్షలకు 2,000 నుండి 5,000 రూపాయల వరకు ఖర్చవుతుందని, కానీ ఈ క్యాంపులో వాటిని ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా, మానసిక వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, రేడియాలజిస్టులు, సికిల్ సెల్ స్క్రీనింగ్ మరియు పాథాలజిస్ట్ సేవలు కూడా ఈ క్యాంపులో అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపర్నెంట్ శ్రీనివాస రావు కోరారు.


