Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 20 చిలిపిచేడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో పోషణ మాసం సందర్భంగా, గౌరవ కలెక్టర్ సార్ మరియు జిల్లా సంక్షేమ అధికారి డి డబల్ ఓ ఆదేశాల అనుసారం, ఈసారి పోషణ మాసం లో, ప్రతి మహిళకి ఎనీమియా చాలెంజ్ గురించి తెలియజేయాలని చెప్పడం జరిగింది. ఎనీ మియా చాలెంజ్ ముఖ్య ఉద్దేశం, వచ్చే సంవత్సరం మహిళా దినోత్సవం నాటికి ప్రతి మహిళ ఆరోగ్య మహిళగా ఉండాలని, ఎవరు కూడా రక్తహీనతతో బాధపడకూడదని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గుజరి తాండలో ఆకుకూరల స్టాల్ఈ ఏర్పాటు చేయడం జరిగింది, ఆకుకూరల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, వచ్చిన తల్లులందరికీ ఎనీ మియా చాలెంజ్ గురించి వివరించడం జరిగింది. మరియు ప్రీస్కూల్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో, తల్లులు, పిల్లలు, గ్రామ పెద్దలు, అంగన్వాడి టీచర్ (శాంతా) ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సంతోషిమాత పాల్గొనడం జరిగింది.