జనం న్యూస్, సెప్టెంబర్ 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
జగదేవపూర్ మండల కేంద్రంలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు, శనివారం పాఠశాల ఆవరణలో వివిధ రకాల పూలతో బతుకమ్మ ను పేర్చి పాఠశాల విద్యార్థులు, మహిళా బోధనా సిబ్బంది కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ వేడుక ఘనంగా జరుపుకున్నారు.
అంతకు ముందు జిల్లా,మండల స్థాయి పోటీలలో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల ప్రతిభ కనబరిచిన సందర్భంగాపి ఈ టీ ఎన్ మధు, జ్యోతి నీ పాఠశాల కరస్పాండెంట్ లలిత, ప్రధానోపాధ్యాయులు
నరసింహారెడ్డి, అభినందించి శాలువాతో సన్మానించి మెమొంట్ అందజేశారు,అనంతరం పాఠశాలలో దసరా వేడుకల్లో ఒక ముఖ్యాంశం ” రవణ దాహన్” పేరుతో రావణుడి భారీ దిష్టి బొమ్మను దహనం చేశారు,
బతుకమ్మను పూలతో అందంగా అలంకరించి,మెదటి బహుమతి బి, యశస్విని, రెండవ, ,శరణ్య, 10 వ తరగతి , వైష్ణవి 7 వతరగతి మూడవ ,నాలుగవ, బహుమతులు ప్రధానం చేశారు,ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలిపారు.ఇది తెలంగాణ మహిళల సంస్కృతిక జీవితంలో భాగం కావాలన్నారు,వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరించి భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించిన్నట్లు తెలిపారు ఈ పండుగ కుటుంబ బంధాలను ,ముఖ్యంగా నిత్రాల మధ్య స్నేహబంధాలను బలపరుస్తుందని పేర్కొన్నారు,శ్రీ చైతన్య పాఠశాల లో విద్యతో పాటు క్రీడల్లో, వివిధ సంస్కృతిక కార్యక్రమంలో నిర్వహించడంలో పాఠశాల ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మచ్చేందర్, రాజేష్, మధు, రమేష్ , భరత్ రెడ్డి, స్వామి, సంధ్య, పద్మ, అరుణ, సరిత, కవిత, జోష్ణ, భవాని, ఉమా, ఆకాంక్ష , రేణుక , తదితరులు పాల్గొన్నారు.




