Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

నిష్పక్షపాతంగా ఉంటూ.. భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి నూతన తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ను కోరారు. డిప్యూటేషన్ లో భాగంగా శాయంపేట తహాసీల్దార్ గా వచ్చిన ప్రవీణ్ కుమార్ ను బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. విధులలో భాగంగా తమ పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు గ్రామ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు……