జనంన్యూస్. 20.సిరికొండ..ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ సిరికొండ మండల కేంద్రంలో పియం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల& కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి హాజరై సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి,జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నూతనంగా ప్రవేశించిన ఆరో తరగతి విద్యార్థులకు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికారు.విద్యార్థులకు పీయం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో& కళాశాలలో ఎన్నో సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు.ఏ కార్పొరేట్ కళాశాలలో లేనివిధంగా ప్రభుత్వం ఆదర్శ పాఠశాల& కళాశాలలోఖాన్ అకాడమీ తరగతులను,ఫిజిక్స్ వాల సహకారంతో ,IIT,JEE తరగతులను నిర్వహిస్తున్నామని వాటిని విద్యార్థులు చక్కగా వినియోగించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.ఈ సందర్భంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు,పలువురిని ఆకట్టుకున్నాయి. ప్రేషర్స్ డే లో విద్యార్థులు డ్యాన్సులతో హంగామా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సౌమిత్రి అధ్యాపకులు హేమలత సౌమిత్రి,రమేష్,సాయన్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను చాటిన బతుకమ్మ సంబరాలు.
పీయం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల& కళాశాలలో బతుకమ్మ సంబరాలు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను చాటాయి. విద్యార్థినిలు,అందమైన బతుకమ్మలను తయారు చేసి ఆటపాటలతో ఆనందంగా ఆడారు. పల్లెల్లో విరబూసిన తంగేడు,బీర గుమ్మడి,బంతిపూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ లయబద్ధంగా బతుకమ్మ ఆటలు ఆడారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిదర్శనం అని తెలిపారు.తెలంగాణ జీవనానికి నిలువెత్తు సాక్ష్యం అని అన్నారు.ప్రకృతిలో సేకరించిన పూలను తిరిగి ప్రకృతికి సమర్పించడం బతుకమ్మ వైశిష్ఠానికి నిదర్శనం అని అన్నారు.బతుకమ్మ అందరికీ మంచి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సౌమిత్రి అధ్యాపకులు హేమలత, రమేష్,సాయన్న,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



