జనం న్యూస్ సెప్టెంబర్ 21:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులంతా కలిసి రకరకాల పువ్వులతో ఆకులతో బతుకమ్మను పేర్చి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులు అంత కలిసి ఆటపాటలతో బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో బతుకమ్మ పండుగ చాలా గొప్పదని, దాని విశిష్టత అందరికి తెలిసే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, ప్రవీణ్ శర్మ, గంగాధర్, విజయ్, రాజనర్సయ్య, రాజేందర్ శ్రీనివాస్, గంగా మోహన్, నరేష్, ట్వింకిల్, సమత కోమలి తదితరులు పాల్గొన్నారు.



