జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అమలాపురం లలితా థియేటర్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా ‘తొలి టికెట్ వేలం పాట’ లో పాల్గొని తొలి టికెట్ ను బెండమూర్లంక గ్రామానికి చెందిన గుర్రం కృష్ణ ఫ్రెండ్స్ 60వేల రూపాయలకు గెలుచుకున్నారు. ఆయనకు పోటీగా మోకా వెంకట సుబ్బారావు 59వేల వరకు పోటీకి వచ్చారు.అయితే టైం లిమిట్ పెట్టడం వల్ల 60వేల రూపాయల వద్ద వేలం పాట ముగిసింది.


