జనం న్యూస్ సెప్టెంబర్ 22 చిలిపిచేడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది ప్రక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం ఉత్తర భారత దేశంలో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం సోమవారం ఉదయం నాలుగు గంటలకు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు తదనంతరం అమ్మవారికి అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు శ్రీ చాముండేశ్వరి దేవి శరన్నవరాత్రులు సందర్భంగా 22 సోమవారం నుండి ఒకటి బుధవారము వరకు అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి సోమవారం ఉదయం 10 నుండి 1 వరకు ముందుగా గణపతి పూజ స్వస్తివాచనము అఖండ దీపారాధన కలశ స్థాపన రుత్విక్వరణము మహా చండి నందా శాఖాంబరి శతాషి భీమా బ్రాహ్మరి రక్తదంతిక కౌశికి మహా ప్రత్యంగిరా మహా శివుడు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి కాలశక్తి ప్రాణ శక్తి జీవశక్తి అది మూలమంత్రాణుష్టానములు మహా విద్యా పారాయణం మహా చండి పారాయణం విపరీత ప్రత్యంగిరా మంత్రమాల పారాయణం భువనేశ్వరి మంత్రమాల పారాయణం దేవి లక్ష్మీ మాల పారాయణం మహాశక్తిన్యాస పారాయణం మంత్రమాల పారాయణం జరిగాయి సాయంత్రము 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మహా పూజ మహా నివేదన హారతి తీర్థ ప్రసాద కార్యక్రమములు జరుపబడును అని ఆలయ ప్రధాన అర్చకులు ప్రభాకర్ శర్మ తెలియజేశారు ఆలయ కమిటీ సభ్యుడు శోభన్ బాబు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆశ్వయుజ మాసం పురస్కరించుకొని అమ్మవారు ఒకే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు


