Listen to this article

మద్నూర్ సెప్టెంబర్ 22 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తూ చెరువులో పడి సాయి చరణ్ (15) విద్యార్థి మృతి చెందినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విజయ్ కొండ సోమవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.