Listen to this article

జనం న్యూస్, సెప్టెంబర్ 23 (కొత్తగూడెం)

సుజాతనగర్ మండల పరిధిలోని టూ ఇంక్లైన్ గ్రామపంచాయతీలో ఘనంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. కోడిచెర్ల తరుణ్, పులి గీత, మాజీ సర్పంచ్ గూగులోతు నాగేష్ తాటిపాముల మల్లికార్జున్, ఎనగందుల రమేష్, మండల రాజు, తిరుపతి, వడ్డేపల్లి శీను తూముల శివ, గుంజపడుగు సాయి, చొప్పరి శివ,ఆధ్వర్యంలో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ గ్రామంలో భక్తిమయ వాతావరణాన్ని నెలకొల్పారు.దేవి అమ్మవారిని అలంకరించి ఆధునిక లైటింగ్ సెట్టింగ్లతో మంత్రముగ్ధంగా సజ్జీకరించడం భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రతి రోజు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామస్తులు, భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు.భక్తి, ఆనందం, ఉత్సాహం మధ్య టూ ఇంక్లైన్‌లో నవరాత్రులు ఘనంగా సాగుతున్నాయి.