పాపన్నపేట.సెప్టెంబర్.22(జనంన్యూస్)
ఏడుపాయలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాజగోపురం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వన దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు వనదుర్గమ్మ తల్లి శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవస్థాన ఈవో చంద్రశేఖర్ తగు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవిందు నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి శెట్టి శ్రీకాంత్ అప్ప, మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



