

జనం న్యూస్:- హైదరాబాద్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక, సెల్ఫీ వీడియో తీసుకొని డాక్టర్ ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. హైదరాబాద్‌లో భర్త, అత్తమామల వేధింపుల కారణంగా ప్రణీత అనే మహిళా డాక్టర్ ఆత్మహత్యాయత్నం చేసింది. సెల్ఫీ వీడియోలో వేధింపుల గురించి ప్రస్థావిస్తూ కన్నీటి పర్యంతమై, ఆత్మహత్యాయత్నం చేసుకుంది ప్రణిత. వెంటనే ఆమెను కర్మన్ ఘట్ – జీవన్ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది బాధితురాలు. డాక్టర్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు భరతమాత మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో గల్లంతైన యువకుడి మృత దేహం ఎట్టకేలకు లభ్యమైంది. ఆదివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో బాణసంచా కాల్చేటప్పుడు చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో సిల్వేరు అజయ్(21) ఆచూకీ దొరకలేదు. అజయ్.. గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.