Listen to this article
జనం న్యూస్ కాట్రేనికోన సెప్టెంబర్ 24

ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గా భాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా మంగళవారం తొలిసారిగా కాట్రేనికోన పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఎస్పీ కి ముందుగా ఘనంగా స్వాగతం పలికారు స్టేషన్ ను పరిశీలించి, రికార్డు లను తనిఖీ చేశారు. మండలం లో శాంతి భద్రతలు గురించి ఆరా తీశారు, స్థానిక పరిసరాల విషయాలను, గ్రామాల వివరాలు విషయాలు గురించి ఎస్పీ కు వివరించారు. శాంతి భద్రతలు విషయాలు, రికార్డు లు భద్రపరిచే విషయాలు లో సిబ్బంది కి ఎస్పీ పలు సూచనలు చేశారు. కార్యక్రమం లో అయన వెంట ముమ్మిడివరం సి ఐ మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్ ఐ అవినాష్, సిబ్బంది పాల్గొన్నారు