వైద్యం,మందులపై అర్షణీయమైన తగ్గింపు ధరలు
జూలూరుపాడు,జనం న్యూస్, సెప్టెంబర్24: అకాల వర్షాల కారణంగా జూలూరుపాడు మండలంలో విష జ్వరాలు ఎక్కుగా పెరుగుతున్నాయి పూర్తిగా మండలం గిరిజన ప్రాంతం మరియు కూలీలపై,వ్యవసాయంపై ఆధారపడే ప్రాంతం అకాల వర్షాల వల్ల గిరిజన ప్రాంత ప్రజలు,పేద వారు,కూలీలు ఉపాధి సరిగా లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అకాల వర్షాల వల్ల గిరిజన ప్రజలు, కూలీలు, పేద ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ ఎదుట ఉన్న శ్రీ విజయ్ మెడికల్ & జనరల్ స్టోర్లో అన్ని రకాల మందులపై 30 శాతం తగ్గింపు ప్రకటించారు. వారికి చెందిన శ్రీహరి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో 24 గంటలు ప్రధమ చికిత్స వైద్యం అందించడంతో పాటు, తీవ్ర మైన జ్వరంతో బాధపడే వారి కోసం జ్వరం కు ఎంసంబంధించిన అన్ని రకాల రక్త పరీక్షలు కేవలం రూ.250కే చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆరెబోయిన కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో“గిరిజన మహిళలు, సోదరులు చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఆ దిశగా తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు, రక్త పరీక్షలు అందిస్తున్నామని త్వరలో పేద ప్రజలకోసం ఏజెన్సీ గ్రామాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావడమే మా లక్ష్యమని. సేవా కార్యక్రమాలలో పలుపంచుకోవడం మాకు ఆనందంగా ఉందిని తెలిపారు.


