ఇచ్చిన హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం నారాయణపురం గ్రామస్తులు.
జనం న్యూస్ సెప్టెంబర్ 24
నడిగూడెం నడిగూడెం మండల నారాయణపురం గ్రామంలో నూతనంగా చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగ కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సహాయ కోఆర్డినేటర్ నాగిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.నడిగూడెం మండలం నారాయణపురం గ్రామంలో ఎన్నికల ప్రచార సందర్భంగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నారాయణపురం గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారెంటీ లతోపాటు నారాయణపురం గ్రామస్తులకు ఏడవ గ్యారెంటీగా బీటీ రోడ్డు నిర్మిస్తానని ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సిఆర్ఆర్ నిధులు 2.20 కోట్ల రూపాయలను కేటాయించి, రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంట్రాక్టర్ సూచించి పనులు ముమ్మరంగ జరిగేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్డుతో పాటు,రెండు వైపులా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడంతో గ్రామస్తుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గత పదేళ్లుగా పాలకులు ఎవరు రోడ్డును పట్టించుకోలేదని తెలిపారు.గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించగా రోడ్డు పనులు పూర్తి కావస్తుండటంతో గ్రామస్తులు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలుపుతూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


