Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం గా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానములో తృతీయ అహోరాత్ర లలితా సహస్ర నామ పారాయణం అత్యంత వైభవంగా బుధవారం ఉదయం నుండి మురుమళ్ళ లలితా పారాయణ బృందం ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుండి లలితా పారాయణ చేసే మాతృమూర్తులు మరియు సమరసత సేవా ఫౌండేషన్ ధార్మిక సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని లలితా సహస్రనామ పారాయణం దిగ్విజయంగా చేయుచున్నారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం దేవస్థానం వారు ఏర్పాటు చేసినారు లలితా పారాయణలో పాల్గొన్న మాతృమూర్తులకు దేవస్థానం వారు తరఫున అమ్మవారి పసుపు కుంకుమ జాకెట్ ముక్క ప్రసాదం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం రూపకర్త సుబ్బయ్య మరియు ఎస్ ఎస్ ఎఫ్ మురమళ్ళ గ్రామ కన్వీనర్ నూలు వల్లీతయారు ల పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతున్నది.