

పయనించే సూర్యుడు జనవరి 29 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కెపి హెచ్ బి కాలనీ ముడవ రోడ్ లో గల శ్రీ కంచికోట పీఠం వారి శ్రీ శ్రీ శ్రీ చక్రధీష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి శివాలయం లో కర్ర వెంకటేశ్వర రెడ్డి శివ స్వామి వేణు గోపాల్ ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మహా పడిపూజ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .
ఈ పూజా కార్యక్రమంలో కూకట్‌పల్లి జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, కలిగినీడి ప్రసాద్ ,పోలే బోయిన శ్రీనివాస్ , పసుపులేటి ప్రసాద్ ,పాదం సూర్య,పులగం సుబ్బు తధితరులు పాల్గొన్నారు.